మరో 'మనం' లో అక్కినేని ఫ్యామిలీ??

Akkineni family in another Manam

11:03 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Akkineni family in another Manam

2014 లో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం 'మనం'. ఈ చిత్రం అక్కినేని వారి ఫ్యామిలీకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ప్రత్యేకం. మూడు తరాల నటులు ఇందులో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో మరపురాని గుర్తుగా నిలిచిపోయారు. నిజ జీవితంలో పాత్రలను తారుమారు చేసి రీల్‌ జీవితంలో ఆ పాత్రలను అల్లిన తీరు అద్భుతం. ఈ చిత్రం చూశాక మెగా స్టార్‌, దగ్గుబాటి, సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబాలు ఇటువంటి కథ కోసం ప్రయత్నించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక దర్శకుడు ఇటువంటి తరహా స్టోరీ లైన్‌నే దిల్‌రాజుకి వినిపించాడు.

నాగార్జున కూడా ఇది విని ఒకే చెప్పి పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మన్నారు. ఆ కథ పూర్తయిపోతే గనుక దిల్‌ రాజు ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఇందులో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని మనం చూడలేం కాబట్టి ఈసారి ఆయన మనవడు అక్కినేని అఖిల్‌ నటిస్తారు. ప్రస్తుతం నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయానా' చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.

English summary

Akkineni family is acting in another Manam script type movie.