అఖిల్‌ కి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన నాగ్‌

Akkineni Nagarjuna gave serious warning to Akhil

06:05 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Akkineni Nagarjuna gave serious warning to Akhil

అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్‌ కు సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడట. అవును నిజంగానే వార్నింగ్‌ ఇచ్చాడని సమాచారం. అసలు విషయంలోకి వస్తే అఖిల్‌ తన మొదటి చిత్రం ఎంపికలో ఏదో పెద్ద తెలిసినట్లు నిర్ణయాలు తీసుకుని అట్టర్‌ ఫ్లాప్‌ కొట్టి కోలుకోలేక చతికిల పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. అయితే నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం తరువాత నటించిన తాజా చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తీ-తమన్నా ముఖ్యపాత్రల్లో నటించారు. ఫ్రెంచ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన 'ఇన్‌టచ్‌బుల్స్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మించింది.

మార్చి 25న విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై సినిమా పై ఆసక్తి పెంచేసింది. ఈ చిత్రం పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అఖిల్ తన రెండో చిత్రం గురించి వంశీతో తెగ చర్చించేస్తున్నాడట. దీనితో నాగార్జున అఖిల్‌ కి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడట. ఎందుకంటే 'ఊపిరి' సినిమాని మార్చి 25న తెలుగు, తమిళంలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ని తారాస్థాయిలో చేస్తుంది. ఈ సమయంలో వంశీ పైడిపల్లి ప్రమోషన్స్‌ కి దూరంగా ఉండడం మంచిది కాదని భావించిన నాగార్జున అఖిల్‌ తో, కావాలంటే 'ఊపిరి' సినిమా రిలీజ్‌ అయ్యాక నీ సినిమా గురించి మాట్లాడుకో అని నాగ్ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడట.

సినిమా రిలీజ్‌ అయ్యాక మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని నా దగ్గరకి వస్తే నేను డిసైడ్‌ చేస్తానని నాగ్‌ చెప్పాడట. అప్పటి వరకు వంశీని డిస్టర్బ్‌ చెయొద్దని నాగ్‌ హెచ్చరించాడట. 'ఊపిరి' చిత్రం విడుదలై దాని రిజల్ట్‌ బట్టి అఖిల్‌ రెండో సినిమా ని వంశీ కి ఇవ్వాలో లేదో అనే దాని పై నాగ్ నిర్ణయం తీసుకుంటాడట.

English summary

Akkineni Nagarjuna gave serious warning to Akhil for disturbing Vamsi Paidipally while Oopiri movie promotions.