నాగార్జున ఆస్తి ఎంతో తెలిస్తే షాకౌతారు!

Akkineni Nagarjuna property details

09:51 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Akkineni Nagarjuna property details

ఓ పక్క కొడుకులు హీరోలుగా వచ్చేసినా, కింగ్ అక్కినేని నాగార్జున మాత్రం 56 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికి అమ్మాయిల మనసులలో ఒక నవ మన్మధుడే. నాగార్జున గ్లామర్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కాని తగ్గడం లేదు. నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరు మూవీస్ లోకి వచ్చినా కూడా కింగ్ నాగార్జున కుర్ర హీరోలనే తలపిస్తాడు. అందుకే వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, రీసెంట్ గా వచ్చిన 'ఊపిరి' చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చింది. మరి నాగార్జున మంచి హుషారుగా ఉండక ఏం చేస్తాడు. అక్కినేని నాగేశ్వరావు కొడుకుగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగార్జున.

నాగార్జున కి ఒక సినిమాలే కాదు బిజినెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. అందుకే నాగార్జునని ఇండస్ట్రీ లో అందరూ బిజినెస్ మైండ్ నాగార్జున అంటారు. నాగార్జున కేవలం తన సంతోషం కోసం మూవీస్ లో నటించడమే తప్ప నిజానికి నాగార్జున ఆ మూవీస్ టైం కూడా బిజినెస్ లో పెడితే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక ఆస్తుల వివరాలకు వస్తే, నాగార్జున కి దాదాపు 10 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్. అదీ కాక రీసెంట్ గా మా టీవీ సేల్ తో వచ్చిన లాభం బోనస్ అయ్యింది. నాగార్జున కి అన్నపూర్ణ స్టూడియో నే కాక చాలా హోటల్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు ఉన్నాయ్. రీసెంట్ గా క్రికెటర్ ధోని తో కలిసి కొత్త వ్యాపారం కూడా నాగార్జున స్టార్ట్ చేశాడు. అదండీ సంగతి.

English summary

Akkineni Nagarjuna property details. Akkineni Nagarjuna has 10,000 crores property.