విక్కీడోనర్‌ రీమేక్‌లో సుమంత్‌!!

Akkineni Sumanth is acting in Vicky Donor remake

12:48 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Akkineni Sumanth is acting in Vicky Donor remake

సత్యం, గోదావరి, గౌరీ వంటి హిట్‌ చిత్రాలతో మెప్పించిన కధానాయకుడు అక్కినేని సుమంత్‌. ఈ హీరో చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ శుభఘడియలు రానే వచ్చాయి. బాలీవుడ్‌లో 2010 సంవత్సరంలో సుజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్ సినిమా 'విక్కీడోనర్‌' చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ అవుతుంది. ఒక యువకుడు తన వీర్యం దానం చేసే కధాశంతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. సుమంత్‌ నుండి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సుమంత్‌ హోమ్‌ బ్యానర్‌ అన్నపూర్ణ స్డూడియోస్‌ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary

Akkineni Sumanth is acting in Vicky Donor remake. And it is a bollywood super hit movie now it is remaking in telugu and producing by Annapurna Studios.