గాగ్రా-లెహంగాలో అదరగొట్టిన అక్షరహాసన్!!

akshara haasan in ghagra lehenga on new movie shooting

06:58 PM ON 21st November, 2015 By Mirchi Vilas

akshara haasan in ghagra lehenga on new movie shooting

నిన్న రిలీజైన చీకటిరాజ్యంతో కమల్ హాసన్ మన ముందుకు వచ్చారు. హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రంలో కమల్ సోలో పర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడన్న టాక్ వచ్చింది. ఈ వయస్సులో కూడా కమల్ సినీపరిశ్రమలో తనదైన హవా సాగిస్తున్నాడు. మరో వైపు కమల్ పెద్ద తనయ శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా అటు దక్షణాదిని, ఇటు ఉత్తరాదిని ఒక ఊపు ఊపుతుంది. క్షణం తీరిక లేకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా శృతిహాసన్ సోదరి అక్షరహాసన్ తనదైన స్టైల్లో వెలిగిపోతుంది. శృతిహాసన్ లానే అక్షరహాసన్ కూడా బాలీవుడ్ చిత్రంతోనే తన కెరీర్ను ప్రారంభించింది.

అక్షర తన మొదటి చిత్రం ధనుష్-అమితాబ్ వంటి బడా హీరోలు ప్రక్క నటించే ఛాన్స్ కొట్టేసింది. 'పా' ఫేమ్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన 'షమితాబ్' అక్షర మొదటి సినిమా. ఇది ఫ్లాప్ అవ్వడంతో అక్షర కెరీర్ అనుకున్నంత రీతిలో సాగలేదు. కొంచెం గ్యాప్ తరువాత అక్షరహాసన్ తన రెండో చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టింది. మొదటి చిత్రంలో కొంచెం హాట్ గా నటించిన అక్షర, ఇప్పుడు 'లైలా కి షాది మై లడ్డు దీవానా' అనే చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రం షూటింగ్ జరుగుతుంది, ఈ మూవీ ఆన్ సెట్స్ లో కొత్త అవతారంలో కనిపించింది. లెహంగా-గాగ్రా డ్రెస్ లో సరికొత్త అవతారంలో దర్శనమిస్తుంది. ఈ మూవీ అయినా హిట్ అయ్యి అక్షరకి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

English summary

akshara haasan in ghagra lehenga on new movie shooting