తెలుగులో నటిస్తున్న అక్షయ్!!

Akshay Kumar debut in telugu

10:10 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Akshay Kumar debut in telugu

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం 'ఎయిర్ లిఫ్ట్' సూపర్ హిట్ అయింది. అంతే కాకుండా అక్షయ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న 'రోబో 2.0' లో విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా హిందీ లో సూపర్ హిట్ అయిన 'పోస్టర్ బాయ్స్' చిత్రాన్ని తెలుగులో రానా రీమేక్ చేస్తున్నాడు. అంతే కాదు ఈ చిత్రాన్ని రానా నే నిర్మిస్తున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. అంతే కాదు ఈ చిత్రాన్ని అక్షయ్ కో-ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. రానాకి-అక్షయ్ కి మధ్య ఉన్న స్నేహం వల్లే అక్షయ్ గెస్ట్ రోల్ లో కనిపించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది. అక్షయ్ ప్రస్తుతం కత్తి రీమేక్, హౌస్ ఫుల్ -3 వంటి వరుస చిత్రాల్లో నటించబోతున్నారు.

రానా కూడా బాహుబలి -2, ఘజి చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు.

English summary

Bollywood Star hero Akshay Kumar is debut in telugu. Hindi super hit movie 'Poster Boyz' is remaking by Rana in telugu and also Rana is producing this movie. In this movie Akshay Kumar is giving cameo.