కరువు దుస్థితి - అక్షయ్ రూ 50 లక్షల విరాళం

Akshay Kumar Donates 50 Lakhs

11:57 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Akshay Kumar Donates 50 Lakhs

సినీ నటులు కూడా సమాజంలో భాగమే. అందుకే సమాజ స్థితిగతులు పరిశీలిస్తూ, తమకు చేతనైన రీతిలో సాయం చేసి ఆడుకోవడం లో కొందరు అగ్రభాగాన వుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా అలానే స్పందించాడు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహారాష్ట్రకు రూ.50లక్షల విరాళం ప్రకటించాడు. మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు ప్రాంతాల్లో కరవు విలయ తాండవం చేస్తోంది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి : సంగీతానికి థమన్ గుడ్ బై!

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరవు రక్కసిని తరిమికొట్టే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం‘ జలయుక్త్‌ శివార్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వర్షాకాలంలో నీటిని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఎక్కడికక్కడ చిన్న చిన్న డ్యామ్‌లు నిర్మించి సక్రమమైన పద్ధతిలో నీటిని వాడుకునేలా చర్యలు తీసుకోవడం తదితర కార్యక్రమాలు ఈ పథకం ద్వారా చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి : 'బాహుబలి 2' తరువాత పెళ్ళికి రెడీ!

ఈ పథకం గురించి తెలుసుకున్న అక్షయ్‌కుమార్‌ స్పందిస్తూ, ప్రభుత్వానికి రూ.50లక్షల విరాళాన్ని అందించాడు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నాడు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందిస్తూ... అక్షయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కరవుతో ఆత్మహత్య చేసుకున్న 180 రైతు కుటుంబాలకు ఆయన గతంలో రూ.90 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాడు కూడా...

ఇవి కూడా చదవండి : విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

English summary

Bollywood Hero Akshay Kumar Donated 50 Lakhs To Mahrashtra Drought Relief Fund.Maharashtra Chief Minister also appreciated Akshay Kumar for his help. In Past also Akshay Kumar Donated 90 lakhs.