పవన్ కళ్యాణ్ డైలాగ్ తో అదరకొట్టిన అక్షయ్ కుమార్(వీడియో)

Akshay Kumar in Zee Telugu Konchem Touchlo Vunte Chepta program

12:24 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Akshay Kumar in Zee Telugu Konchem Touchlo Vunte Chepta program

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మొదటిసారి తెలుగు బుల్లితెరపై కనిపించబోతున్నారు. జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే సెలబ్రిటీ ప్రోగ్రాంకి అక్షయ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఒక తెలుగు కార్యక్రమానికి, అది కూడా ఒక బుల్లి తెర కార్యక్రమానికి ఒక బాలీవుడ్ స్టార్ నటుడు పాల్గొనడం నిజంగా గొప్ప విషయం. అక్షయ్ తో పాటు గోవా బ్యూటీ ఇలియానా కూడా విచ్చేసింది. వీరిద్దరూ కలిసి తాజాగా నటించిన రుస్తుం సినిమా ముచ్చట్లు గురించి తెలియజేసారు. అంతే కాదు అంత స్టార్ హీరో ఒక తెలుగు స్టార్ హీరో డైలాగ్ ని కూడా చెప్పారు.

ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన 'సింహం నేను సేమ్ టు సేమ్' అనే డైలాగ్ ను అక్షయ్ కుమార్ తనదైన శైలిలో చెప్పారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్ వెయ్యండి.

English summary

Akshay Kumar in Zee Telugu Konchem Touchlo Vunte Chepta program