గెటప్ చేంజ్ చేసిన అక్షయ్

Akshay Kumar New Look For New Film Dishoom

11:35 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Akshay Kumar New Look For New Film Dishoom

ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోవడం అలవాటు చేసుకుంటేనే సినీ నటులు ప్రేక్షకులను అలరించగలరు లేకపోతే వెనుకబడిపోతారు. ఈ సూత్రాన్ని చాలా తక్కువమంది జీర్ణించుకుంటారు. అందులో బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ ఒకడు. తాజాగా ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకుని గెటప్ , స్టైల్ మార్చేసుకున్నాడు. పోలీస్ , విలన్ , లాయర్ గా ఇలా రకరకాల రోల్స్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అక్షయ్, న్యూఫిల్మ్ ‘డిషూం’లో కంప్లీట్ గా గెటప్ చేంజ్ చేసేసాడు. ఈనెల 29న బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. అన్నిహంగులు పూర్తి చేసుకోవడంతో నటీనటుల పిక్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.

యాక్షన్ - అడ్వంచెరస్ చిత్రంగా రానున్న ఇందులో జాన్ అబ్రహాం, వరుణ్ దావన్, అక్షయ్ కుమార్ లు పోటీపడి మరీ నటించారు. ఇక హీరోయిన్ జాక్విలెస్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినట్టు యూనిట్ టాక్. అరేబియా సముద్రంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు ఫిల్మ్ కి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి అక్షయ్ న్యూ లుక్ ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

ఇది కూడా చూడండి: శ్రీమహావిష్ణువు శిలగా మారింది ఇక్కడేనా?

ఇది కూడా చూడండి: సింగర్ సునీత గురించి నమ్మలేని నిజాలు

ఇది కూడా చూడండి: బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

English summary

Akshay Kumar New Look For New Film Dishoom