ఈ కలయికలో మరో సినిమా

Akshay Kumar Next Film Details

10:32 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Akshay Kumar Next Film Details

బాలీవుడ్‌ స్టార్‌  అక్షయ్‌ కుమార్‌,  ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసిన దర్శకుడు నీరజ్‌పాండేల కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పెషల్‌ 26, బేబీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించే కథాంశంతో తెరకెక్కిన ‘బేబి’ చిత్ర స్క్రిప్ట్‌ ఆస్కార్‌ అకాడమీ గ్రంథాలయంలో ఉంచేందుకు కూడా ఎంపికైంది. ఇక  ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్షయ్ ఇటీవల విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎయిర్‌లిఫ్ట్‌ చిత్ర విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే మరో సిన్మా  షూటింగ్‌కి సిద్ధమైపోతున్నాడు. ఎ వెడ్నెస్‌డే, బేబీ, స్పెషల్‌ 26 వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసిన దర్శకుడు నీరజ్‌పాండే దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రుస్తుం’ అనే చిత్రంలో అక్షయ్‌ నటించనున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నీరజ్‌ పాండే ధోని జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు., అది అలా ఉండగానే అక్షయ్ , నీరజ్ పాండే కాంబినేషన్ లో మరో చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

English summary

Bollywood Star Hero Akshay Kumar Was presently enjoying the success of his latest movie "Air Lift".Air Lift movie colled 100 crores within 9 days of the movie release.Now Akshay Kumar to Start working under the direction of Neeraj Pandey.Previously they were work together in Special 26,Baby movie which were super hit at box office.