ఎవరూ ఊహించని పాత్ర ఇది .. మేకప్ కే 6 గంటలు పట్టేసిందట

Akshay kumar takes six hours to make up

11:05 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Akshay kumar takes six hours to make up

ఇప్పటికే కబాలీలో హోల్ ఫీవర్ సృష్టించిన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న నేపథ్యంలో ఆ మధ్య ఆయన గెటప్ కి సంబంధించిన ఒక స్టిల్ బయటికి వచ్చింది. కాకిని పోలిన గెటప్ లో వున్న అక్షయ్ ని చూసినవారు రకరకాలుగా ఊహించుకొంటున్నారు. అక్షయ్ పిచ్చి సైంటిస్ట్ పాత్ర చేస్తున్నాడని అనుకొంటున్నారు. వీటన్నిటినీ అక్షయ్ కుమార్ ఎంజాయ్ చేస్తున్నాడట.

ఈ విషయాలు తనకి కొత్తగా అనిపిస్తున్నాయని అన్నాడట. ఆ గెటప్ లో తాను ఒక హోటల్ కి వెళ్లగా ఎవరూ తనని విచిత్రంగా చూడలేదని.. కాకపోతే గుర్తుపట్టలేదని అక్షయ్ కుమార్ చెప్పాడట. వైవిద్యభరితమైన గెటప్ కి సంబందించిన మేకప్ వేయడానికి 6 గంటలు పట్టేదని చెప్పుకొచ్చాడు. తన పాత్ర కొత్తగా.. ఎవరూ ఊహించలేని విధంగా ఉంటుందని అక్షయ్ చెప్పాడట. మొత్తానికి విలన్ గా చరిత్ర సృష్టిస్తాడని అంటున్నారు.

ఇది కూడా చూడండి: నీతా అంబానీ కాస్ట్లీ లైఫ్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

ఇది కూడా చూడండి: పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

ఇది కూడా చూడండి: సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

English summary

Akshay kumar takes six hours to make up.