రోబో -2 లో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో

Akshay Kumar To Act As Villian In Robo-2

06:50 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Akshay Kumar To Act As Villian In Robo-2

శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా రూపోందించిన రోబో చిత్రం ఎంతటి సంచలనం విజయం సృష్టంచిందో తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్‌ గా రోబో-2 పేరుతో రానున్న సినిమా లో విలన్‌ పాత్రకు ముందు హలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ నటిస్తాడని భావించారు , ఆ తరువాత హృతిక్‌రోషన్‌ నటిస్తాడని అందరు అనుకుంటున్న సమయంలో దర్శకుడు శంకర్‌ ఆ వాదలన్నీటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ విలన్‌ గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడని తెలిపాడు. రోబో-2 లో హీరోయిన్‌గా లండన్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ నటిస్తోంది. ఈ చిత్రంలోని ఎమీజాక్సన్‌ దుస్తులను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. ఈ సినిమాను 3డీ రూపంలో రూపోందించాలని శంకర్‌ భావిస్తున్నారట. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నాడు. రోబో -2 సినిమా 400 కోట్లు భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించనున్నట్లు డైరక్టర్‌ శంకర్‌ తెలిపాడు.

English summary

Bollywood Hero Akshay Kumar To Act As villian in Rajini Kanth's Robo-2 Movie. This Was officially Declared By Director Shankar