కత్తి రీమేక్‌ లో నటించనున్న అక్షయకుమార్‌

Akshay Kumar To Act In Katthi Remake In Bollywood

06:07 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Akshay Kumar To Act In Katthi Remake In Bollywood

బాలీవుడ్‌లో అక్షయకుమార్‌ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. తన మార్కు నటన ,స్టైల్‌ తో అందరిని ఆకట్టుకున్న అక్షయకుమార్‌ తాజాగా తమిళంలో విడుదలై సంచలనం సృష్టించిన 'కత్తి' సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్‌ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తమిళంలో విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్వకత్వంలో నటించిన సూపర్‌ హిట్‌ మూవీ కత్తి .దీనికి తెలుగులో కూడా రీమేక్‌ చెయ్యడానికి చాలా మంది ముందుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఎవరు నటిస్తున్నరనేది అంతు చిక్కని ప్రశ్న. బాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాలో అక్షయకుమార్‌ నటించనున్నాడు. ఐతే ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రం మురుగదాస్‌ శిష్యుడు జగన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషలలో మహేష్‌బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సివుండడంతో ఆయన శిష్యుడు జగన్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.తమిళంలో రికార్డులు తిరగరాసిన 'కత్తి' హిందీలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

English summary

Askhay Kumar to act in the remake tamil super hit movie 'Kathi' in bollywood. Murugadas directed this film in kollywood. Its was a super hit in tamil film industry