సూపర్ స్టార్ చేతిలో అక్షయ్ తన్నులు తింటాడా? 

Akshay Kumar To Fight With Rajinikanth

09:53 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Akshay Kumar To Fight With Rajinikanth

హీరోల మధ్య ఫైటింగ్ లు జగిన సందర్భాలూ ఉన్నాయా, మరి అలాగైతే, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ కి - బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌కి మధ్య ఫైటింగా. ఈ సందర్భంగా రజనీ చేతిలో అక్షయ్ తన్నులు తింటాడా? ‘రజనీ చేతిలో తన్నులు తినే అదృష్టం కన్నా ఆనందం ఏముంటుంది?’ అని అక్షయ్‌ అంటున్నాడా? అసలెందుకు వీరిద్దరి మధ్యా గొడవ అంత దాకా వెళ్ళింది? ఓ సారి పరిశీలిద్దాం. రజనీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘2.0’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు అక్షయ్‌. ‘రోబో’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకి, అక్షయ్‌కు మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయట. దీని గురించి అక్షయ్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఎన్నో ఫైట్లు చేశాను. కానీ రజనీతో ఫైట్‌ చేయడం, ఆయన చేతి దెబ్బలు తినే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అయితే ఈ పోరాట సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణేం తీసుకోలేద’’ని చెప్పాడు అక్షయ్‌. అదండీ సంగతి.

English summary

Bollywood Hero Akshay Kumar was acting as villian in Rajinikanth's upcoming film Robo-2.0.This movie was sequel for the previous movie Robo.In this movie there were soo many fighting scenes.Amy Jackson was acting as heroine in this movie