సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్న ఇంగ్లాండ్ క్రికెటర్

Alastair Cook is ready to break Sachin's record

04:12 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Alastair Cook is ready to break Sachin's record

క్రికెట్ దేవుడుగా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. సచిన్ నెలకొల్పిన రికార్డుల్లో టెస్టుల్లో పదివేల పరుగుల రికార్డు చాలా గొప్పది. కాకపోతే ఇప్పుడు ఆ రికార్డు త్వరలోనే బ్రేక్ కాబోతుంది. ఈ 10,000 పరుగుల రికార్డు నెలకొలిపే నాటికి సచిన్ వయసు 35 సంవత్సరాల 10 నెలలు. వయసు దృష్ట్యా ఆ రికార్డు నేటి వరకూ సచిన్ టెండుల్కర్ పేరు మీదనే ఉన్నప్పటికీ, ఆ రికార్డు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ ఆటగాడు కుక్ వశం కానుంది. పదివేల పరుగులు పూర్తికావడానికి కుక్ కు కేవలం 36 పరుగులు మాత్రమే మిగిలివున్నాయి.

32 ఏళ్ళు వయసున్న కుక్, ఇంకో రెండు వారాల్లో శ్రీలంక-ఇంగ్లండ్ ల మధ్య జరుగునున్న టెస్టు సిరీస్లో సచిన్ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 2006లో టెస్టు మ్యాచుల్లోకి అడుగుపెట్టిన కుక్, తాను ఆడిన తొలి టెస్టు మ్యాచ్ లోనే 100 పరుగులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. కాగా ఇతగాడు నేటి వరకూ ఆడిన 126 టెస్టు మ్యాచ్ లలో 46.56 సగటు రన్ రేటును కలిగి, మొత్తం 9,964 పరుగులను ఇప్పటిదాకా తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 28 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు కుక్ ఖాతాలో ఉన్నాయి.

English summary

Alastair Cook is ready to break Sachin's record. England Test Cricket Captain Alastair Cook is ready to break Sachin's 10,000 test cricket runs record.