అల్కాటెల్ నుంచి ఐడోల్ 4, ఐడోల్ 4ఎస్ స్మార్ట్ ఫోన్లు

Alcatel Idol 4, Idol 4S Smartphones

06:51 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Alcatel Idol 4, Idol 4S Smartphones

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ అల్కాటెల్ రెండు స్మార్ట్ ఫోన్లు ప్రవేశపెట్టింది. ఐడోల్ 4, ఐడోల్ 4ఎస్ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. ఐడోల్ 4 ధర రూ. 21,300. ఐడోల్ 4ఎస్ ధర రూ.34,300. ప్లస్ 10 పేరిట ఓ విండోస్ 2 ఇన్ 1 టాబ్లెట్‌ను కూడా అల్కాటెల్ విడుదల చేసింది. 10 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 800 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ఇంటెల్ ప్రాసెసర్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డిటాచబుల్ కీ బోర్డ్, 8410 ఎంఏహెచ్ బ్యాటరీ, మైక్రో యూఎస్‌బీ, స్టాండర్డ్ యూఎస్‌బీ, మైక్రో హెచ్‌డీఎంఐ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ టాబ్లెట్ ధరను త్వరలో వెల్లడించనుంది.

ఐడోల్ 4 ఫీచర్లు ఇవే..

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2610 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0

ఐడోల్ 4ఎస్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, వైఫై డైరెక్ట్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2

English summary

Chinese popular electronics company Alcatel launched launched three new devices in the market - two smartphones namely the Idol 4 and the Idol 4s in MWC.