ఆల్కాటెల్‌ నుంచి వన్‌టచ్‌ ఫియర్స్ ఎక్స్ ఎల్

Alcatel OneTouch Fierce XL Windows Mobile

04:49 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Alcatel OneTouch Fierce XL Windows Mobile

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆల్కాటెల్‌ వన్‌టచ్‌ విండోస్‌-10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది. ఆల్కాటెల్‌ వన్‌టచ్‌ ఫియర్స్‌ ఎక్స్‌ఎల్‌ పేరిట ఈ ఫోన్‌ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్‌-2016లో ఆవిష్కరించింది. అయితే ఈ ఫోన్‌ ధరని మాత్రం ఆల్కాటెల్ ప్రకటించలేదు. కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. 5.5 అంగుళాల హెచ్ డీ తాకే తెర, 1.1గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 8 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 4జీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Alcatel mobile company announced its first Windows 10 Mobile powered Fierce XL smartphone at CES 2016.Its was presently available in a few weeks in US