19ఏళ్ళ వయసులో 8 వేల కోట్లు సంపాదించేసింది.. ఎలాగో తెలుసా?

Alexandra Andresen is billionaire in 19 years

12:20 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Alexandra Andresen is billionaire in 19 years

డబ్బు సంపాదన అనేది అందరికీ వుండే కల. కానీ సక్రమంగా సంపాదించడం నేర్పుతో కూడిన కళ. సరిగ్గా ఇలానే సంపాదించేవాళ్ళు వున్నా, అడ్డదారుల్లో కూడా సంపాదించేవాళ్లున్నారు. మరి ఈ అమ్మడు ఏ బాపతో చూద్దాం. అలెగ్జాండ్రా అండర్సన్ ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన బిలియనీర్ గా ఫోర్బ్స్ జాబితాకెక్కింది. ఈ నార్వే చిన్నదాని సంపద అక్షరాలా రూ.ఎనిమిదివేల కోట్లు. పందొమ్మిదేళ్ల అమ్మాయి ఏం చేస్తుంది. కాలేజీకి వెళుతూ ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్లు చేస్తుంది. మహా అయితే పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమలో పడుతుంది. పెద్దలు కూడబెట్టిన ఆస్తిని ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. కానీ అలెగ్జాండ్రా అలా చేయలేదు. తన కుటుంబీకుల నుంచి అప్పనంగా వచ్చిన ఆస్తిని ఈ అమ్మడు రెట్టింపు చేయడమే పనిగా పెట్టుకుంది.

తనకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే దాదాపూ ఏడు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్, షేర్లలో పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా తన ఆస్తి రెట్టింపు అయ్యి.. ఫోర్బ్ జాబితాలో పిన్నవయసులో బిలినియర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ చిన్నది, సంపాదనే కాదు పొదుపులో కూడా దిట్టే. ఎందుకంటే, వేల కోట్ల ఆస్తి ఉన్నాసరే, తను ఏనాడు ఆ దర్పాన్ని ప్రదర్శించేది కాదు. పాతకార్లను వాడుకునేది. అంతేకాదు తనకు గుర్రపు రేసులు, క్విజ్ పోటీలు అంటే చాలా ఇష్టం. వాటిల్లో పాల్గొని వచ్చిన ఫ్రైజ్ మనీతో అవసరాలను తీర్చుకునేది. ఒక్కోసారి పేద అమ్మాయిలా ఉండే అండర్సన్. ఓ సారి బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు ఉండటం చూసిన తన స్నేహితులు నోరెళ్లబెట్టేవారని తెలిపింది.

English summary

Alexandra Andresen is billionaire in 19 years