పేదల కళ్ళలో అనందం కోసం 26 వేల కోట్లను దొంగిలించాడు

Algerian Hacker Hamza Hanged By Thailand Police

05:56 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Algerian Hacker Hamza Hanged By Thailand Police

డబ్బున్న వాళ్ళను దోచి , పేదలకు పెట్టడం ఓ సిద్ధాంతం అయితే, పేదల కళ్ళల్లో ఆనందమే లక్ష్యంగా పనిచేసాడు ఓ వ్యక్తి. ఆ మధ్య రిలీజైన కిక్ సినిమాలో రవితేజ రిస్క్‌లో కిక్కును వెతుకున్న సంగతి గుర్తుందా ? అల్జీరియన్ హ్యకర్ హంజా బెండలార్జ్ సరిగ్గా అలానే చేసాడు ఆలోచన వచ్చిందే తడువుగా బ్యాంకులకు టోకరా వేసి దాదాపూ మిలియన్ డాలర్లు దోచుకున్నాడు. అయితే ఆ డబ్బుతో జల్సా చేయలేదు... ఎంజాయ్‌ చేయలేదు. తాగి తగలెయ్య లేదు. దోచుకున్న డబ్బును పేదలకు పంచాలని నిర్ణయించుకున్నాడు. అలా కోట్లాది రూపాయలను ఛారిటబుల్ ట్రస్ట్‌లకు విరాళంగా ఇచ్చేశాడు. తర్వాత తన ప్రాణాలను తృణప్రాయంగా ఉరికంభం ఎక్కాడు. అయినా తాను చేసిన పనికి మనస్పూర్తిగా నవ్వుతూ అంపశయ్యపై ధీశాలిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి: తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

వినడానికి వింతగా, చూడ్డానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆధునిక యుగంలో పేదలకు సహాయం చేయాలన్న తన సహృదయంతో అందరి మన్ననలను పొందాడు. అల్జీరియన్ హ్యకర్ హంజా బెండలార్జ్. కంప్యూటర్ గ్రాడ్యూయేట్ అయిన హంజా హ్యాకింగ్‌లో మొనగాడు. కానీ తాను చేసిన పనికి థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేసి బహిరంగంగా ఉరిశిక్ష వేశారు. అందుకు కారణం లేకపోలేదు. స్పైఈ అనే వైరస్ కు బీఎక్స్ ఐ అనే కోడ్ ను జతచేసి సిమ్లింగ్ హ్యాకర్ అనే మారుపేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న మిలియన్ కంప్యూటర్ లలో ఆ వైరస్ ను వ్యాపింపచేశాడు. వాటిలో యూనైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా ఉన్నా ఇజ్రాయిల్ దేశానికి చెందిన అన్నీ ప్రభుత్వ వెబ్ సైట్ లలో పంపించాడు. దీంతో వివిద దేశాలకు చెందిన 217 బ్యాంకుల్లో తన వైరస్ ద్వారా రూ.26 వేల కోట్లును దొంగిలించాడు. ఇలా దొంగిలించిన సొమ్మును పేద ప్రజలకు పంచాడు.

ఇవి కూడా చదవండి: దర్శకులపై నోరు జారిన విష్ణు

దీంతో వివిధ దేశాల ప్రభుత్వ శాఖలకు సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే హ్యాకర్ హంజా మలేషియా, ఈజిప్ట్, బ్యాంకాక్ లకు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా థాయ్ లాండ్ పోలీసులు 2013 జనవరి 6న అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ఇంటర్ పోల్ పోలీసులు పలు ఆసక్తికర విషయాల్ని వెలుగు చూశారు. హంజా కనిపెట్టిన స్పైఈ వైరస్ ద్వారా అమెరికా , యురేపియా దేశాలకు చెందిన బ్యాంకుల్లో 10 – 20 మిలియన్ డాలర్ల ఖజానాను కొల్లగొట్టాడు. ఆ సొమ్ము తో కొంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. మిగిలిన డబ్బును పాలస్తీనాకు చెందిన ఛారిటబుల్ ట్రస్టులకు దానంగా ఇచ్చాడు. దీనిపై మే2013, అంట్లాటా జార్జియా కోర్టులో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి: జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

కాగా హ్యాకర్ హంజాను ఉరితీశాడనే వార్తలు అల్జిరీయా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేశాయి. దీంతో హంజా మరణంపై ఆయన మద్దతుదారులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీని పై స్పందించిన అల్జీరియా మంత్రిత్వ శాఖ కంప్యూటర్ నేరాలు కాదు మరణార్హనేరాలైన వారికి ఉరిశిక్ష విధిస్తారని ట్విట్ చేసింది.

ఇవి కూడా చదవండి: వైసీపీ ఎమ్మెల్యేలు తప్పిన ప్రమాదం

ఇవి కూడా చదవండి: రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

English summary

Algerian Hacker Hamza had hacked all government and bank websites by spreading virus and he theft 4000 million dollars of amount and gave it to Charities . He was arrested by Thailand Police and he was hanged in the public.