పవన్ మూవీలో ఆలీకి ఝలక్ - సునీల్ ఎంట్రీ

Ali replaced by sunil in Pawan kalyan new movie Kaatama Rayudu

11:03 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Ali replaced by sunil in Pawan kalyan new movie Kaatama Rayudu

వరుసపెట్టి మూవీలు పూర్తిచేసి ఆతర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్న సంగతి తెల్సిందే. అయితే పవన్ - త్రివిక్రమ్ కాంబో గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం స్టోరీ చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు టాక్. నటీనటుల ఎంపికలో మాటల మాంత్రికుడు బిజీ అయ్యాడట. ఇదిలావుండగా పవన కల్యాణ్ కి ఫ్రెండ్ గా ఈసారి కమెడియన్ సునీల్ కనిపించనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో కమెడియన్ గా సునీల్ కనిపించేవాడు.. ఎప్పుడైతే హీరోగా టర్న్ అయ్యాడో కమెడియన్ రోల్స్ కి దూరమయ్యాడు. చివరకు త్రివిక్రమ్ రిక్వెస్ట్ తో పవన్ మూవీకి సునీల్ ఓకే అన్నట్లు సమాచారం. పవన్ సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా మాగ్జిమమ్ అలీ కనిపించేవాడు! ఈసారి అలీని పక్కనపెట్టినట్టే కనిపిస్తోందట. ప్రస్తుతానికి పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాటలైతే జరుగుతున్నాయని, సెట్స్ పైకి వెళ్లేసరికి ఇంకెన్ని పేర్లు వస్తాయోనని అంటున్నారు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఈ మూవీని హారిక హాసిని క్రియేష న్స్ బ్యాన ర్ పై నిర్మించ నున్నారు. ఇక హీరోగా రాణిస్తున్న టైంలో సునీల్ మళ్లీ కమెడియన్ ట్రాక్ లోకి రావడ మేంటని పవన్ ఫ్యాన్స్ అనుకోవచ్చు గానీ , ఇటీవల ఈడు గోల్డ్ ఎహే మూవీ ఆడియో లాంచ్ సందర్బంగా కామెడీ రోల్స్ వేయడానికి అభ్యంతరం లేదని, తగిన అవకాశం వస్తే, చేస్తానని కూడా సునీల్ చెప్పుకొచ్చాడు. సో... పవన్ మూవీలో కనిపించడం ఖాయమన్న మాట.

ఇది కూడా చూడండి: దసరా వేడుకల్లో బెంగాలీల ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: క్రీడల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే ఇది తినాల్సిందే!

ఇది కూడా చూడండి: కలలో మీరు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

English summary

Ali replaced by sunil in Pawan kalyan new movie Kaatama Rayudu. Pawan kalyan upcoming movie Kaatama Rayudu directed by trivikram.