హీరోతో ఎఫైర్‌పై నోరు జారిన ఆలియా

Alia Bhatt hot comments on hero

01:01 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Alia Bhatt hot comments on hero

బాలీవుడ్ హాట్ బికినీ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పకనే చెప్పేసింది. ఆ సమాధానం ద్వారా తన ప్రియుడు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. ఆ బికినీ బ్యూటీ మరెవరో కాదు ఆలియాభట్. సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆలియా ప్రేమాయణం గురించి తరచూ వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి హాట్ హాట్ ఫోటోషూట్ లకి ఏ మాత్రం బిడియం లేకుండా ఫోజులు ఇచ్చిన సంగతి కూడా తెలుసిందే. ఇప్పుడు ఆలియా తన ప్రేమ విషయాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చెప్పకనే చెప్పింది. ర్యాపిడ్ రౌండ్ లో భాగంగా ఈ సమాధానం చెప్పింది ఆలియా.

మీరు ఒక దీవిలో గడపవలసి వస్తే ఎవరితో గడపడానికి ఇష్టపడతారు? అక్కడ సంసారం చేయాల్సివస్తే ఎవరితో చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆలియా తడుముకోకుండా సిద్ధార్థ్ మల్హోత్రా పేరు చెప్పేసింది. అయితే ఇచ్చిన ఆప్షన్స్ లో రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్, షాహిద్, వరుణ్ ధావన్ వంటి యువ హీరోలు ఉన్నా.. అలియా మాత్రం సిద్ధూతోనే సంతోషంగా గడుపుతా అని సమాధానం చెప్పింది. మరి ఈ బికినీ బ్యూటీ మనసులో ఎంత ప్రేమ ఉండకపోతే ఆ మాట చెబుతుంది? అంటూ ఇప్పుడు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సిద్ధూతో గాఢంగా ప్రేమలో ఉన్నట్టు అలియా పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని అందరూ అనుకుంటున్నారు.

English summary

Alia Bhatt hot comments on hero