నా ఫస్ట్ నైట్ వాళ్ళకే అంకితం అంటున్న స్టార్ హీరోయిన్!

Alia bhatt is dedicating her first night to her parents

11:33 AM ON 24th October, 2016 By Mirchi Vilas

Alia bhatt is dedicating her first night to her parents

సాధారణంగా పుస్తకాలను అంకితం ఇస్తారు. కానీ ఫస్ట్ నైట్ అంకితమేంటి బాబూ... మరీ ఫాస్ట్ గా ఉందిగా కాలం. ఇంతకీ విషయం ఏమంటే, శృంగార చిత్రాల దర్శకుడు మహేష్ భట్ ముద్దుల కూతురు అలియాభట్ పెళ్లి కాకుండానే కొత్త ఇంట్లో, కొత్త కాపురం పెట్టబోతోంది. తల్లిదండ్రులకు దూరంగా కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి అలియా మారబోతోంది. అక్కాచెల్లెళ్లు అలియా, షహీన్ లు గృహప్రవేశం రోజు రాత్రి తమ కొత్త ఇంట్లో ఏం చేయబోతున్నారో కూడా చెప్పేశారు. ఈ నేపథ్యంలో 'ది ఫస్ట్ నైట్ ఇన్ ది న్యూ హౌస్ విల్ బీ డెడికేటెడ్ టు మై పేరెంట్స్' అని అలియా ట్వీటేసింది.

తమ కొత్త ఇంట్లో ఫస్ట్ నైట్(తప్పుగా అర్థం చేసుకున్నారా?)ను తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేసింది. నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్(కొత్త ఇంట్లో తొలిరాత్రి అనే) చాలా ముఖ్యమైన వేడుక. ఆ రోజు సన్నిహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తా అని చెబుతోంది. 23 ఏళ్లకే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడంతో పాటు ఓ కొత్త ఇళ్లు కూడా కట్టుకున్న అలియాకు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదండీ సంగతి.

English summary

Alia bhatt is dedicating her first night to her parents