మహేష్ తో అలియా భట్ కి వర్కౌట్ అయింది

Alia Bhatt To Act With Mahesh Babu

10:13 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Alia Bhatt To Act With Mahesh Babu

బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ మొత్తానికి మహేష్ బాబుని వర్కౌట్ చేసుకుందని అంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. మహేష్ లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం తర్వాత సౌతిండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన మురుగదాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న నేపధ్యంలో ఈ సినిమాలో మహేష్ సరసన
శృతిహాసన్, కీర్తి సురేష్, శ్రద్ధా కపూర్ ఇలా పలువురి పేర్లు వినిపించాయి. అయితే, చివరికి అలియాభట్ ను డిసైడ్ చేశారని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. ఠాగూర్ మధు..ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీగా 80కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటిస్తోన్నందుకు అలియా భట్ కు కూడా బానే రెమ్యూనరేషన్ ముడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపక్క మాంచి రెమ్మునరేషన్, మరో పక్క మహేష్ తో నటించే అవకాశం రావడంతో ఈ ముద్దుగుమ్మ యమా ఖుషీ ఖుషీగా ఉందట.

ఇవి కూడా చదవండి:వావ్..శృతి పెళ్లి చేసుకుందా..?

ఇవి కూడా చదవండి:40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చెయ్యలేదని కన్నతల్లిని చంపేసాడు

English summary

Super Star Mahesh Babu was presently acting in Brahmotsavam movie and this movie was going to be released on May 29th. After this movie Mahesh Babu to act under the Direction of Tamil Top Director A.R,Murugadoss. Recently according to a recent updates that Alia Bhatt was selected as heroine to this movie.The budget of this movie was 80 crores. This movie was going to be shoot in both Telugu and Tamil Languages.