పుట్టింటోళ్ళూ తరిమేశారు..

Alisha Khan parents sent her outside from home

12:27 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Alisha Khan parents sent her outside from home

ఆ మధ్య ఓ సినీ కవి రాసిన పుట్టింటోళ్ళూ తరిమేశారు... అనే పాట ఆ రోజుల్లో మంచి హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు నిజంగానే అలాంటి ఘటన ఓ హీరోయిన్ విషయంలో జరిగింది. ఆమె ఓ పేరున్న బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్. ఇమ్రాన్ హష్మి లాంటి ఫేమస్ హీరో పక్కన చేస్తోంది. అలాంటమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తే.. ఎక్కడికీ వెళ్లలేక ఢిల్లీలోని వీధుల వెంబడి ఒంటరిగా తిరుగుతూ కనిపించేసరికి మీడియా వాళ్ళు అవాక్కయ్యారు. ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ హీరోయిన్ వ్యవహారమేంటంటే... ఇక్కడ మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు అలీసా ఖాన్.

బాలీవుడ్ మూవీ ‘మై హజ్బెండ్స్ వైఫ్’ లో ఇమ్రాన్ హష్మి సరసన హీరోయిన్ గా నటించింది. సీరియల్ కిస్సర్ గా ముద్ర పడిన ఇమ్రాన్ హష్మి హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మధ్యే అలీసా బాయ్ ఫ్రెండ్.. వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టేశాడు. అది చూసిన ఆమె తల్లిదండ్రులకు ఒళ్లు మండిపోయింది. అసలు సినిమాల్లో నటించడానికే ఇష్టపడని వారు.. ఈ వీడియో చూశాక కోపంతో రగిలిపోయారు. దీంతో అలీసాను ఇంటి నుంచి గెంటేశారు. ఘజియాబాద్ లో వీరిది గొప్ప పేరున్న కుటుంబం. అలీసాకు సంబంధించిన వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటుండటంతో ఆమెను బయటికి పంపించేశారు.

ఉన్నపళంగా ఇంటి నుంచి బయటపడిన అలీసా ఢిల్లీలోని కైలాష్ ప్రాంతంలో వీధుల వెంట తిరుగుతూ ఓ గుడిలో తలదాచుకోవడం గమనార్హం. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో ముంబయికి చేరుకున్న ఆమెకు ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. రాఖీ వోహ్రా అనే నటే తన పై లైంగిక వేధింపులకు పాల్పడిందని అప్పట్లో అలీసా కేసు పెట్టడం పెద్ద సంచలనం అయింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

English summary

Alisha Khan parents sent her outside from home