అల్లు అర్జున్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

All Arjun Bollywood entry

11:14 AM ON 21st January, 2016 By Mirchi Vilas

All Arjun Bollywood entry

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ 'ధూమ్‌ 4' సినిమా ద్వారా హిందీ సినిమాలో కనిపించనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌ 'ధూమ్‌ 4' సినిమా ద్వారా బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వటం లేదు. తెలుగులో భారీ విజయం సాధించిన 'రేసు గుర్రం' సినిమాని 'ధూమ్‌ 4' గా హిందీ లోకి డబ్బింగ్‌ చేస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్‌ అయ్యి హిందీలో ప్రచారం అవుతాయి. కానీ వాటి మీద ప్రేక్షకులు ఆసక్తి చూపరు. అందువల్ల ఒక కొత్త టైటిల్‌ ను పెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు డబ్బింగ్‌ చెయ్యడం చివరిదశకు చేరుకుంది. త్వరలోనే ధూమ్‌ 4 గా ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

ఈ సినిమాకి తెలుగులో సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్‌ మొదటి సారి 50 కోట్ల క్లబ్‌ లో ఎంటర్‌ అయ్యాడు. ఈ సినిమా అతని కెరీర్‌ లోనే పెద్ద విజయం సాధించింది. శృతిహాసన్‌ ఈ సినిమాలో కధానాయిక. శృతిహాసన్‌ హందీలో ఫేమస్‌ అవడంతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

English summary

All Arjun's super hit movie Race Gurram is releasing as a Dhoom 4 in Bollywood. It is a super hit movie in allu arjun carrier. Shruti Hassan was romanced in this film and directed by Surendar Reddy.