రీమేక్ పై మోజు పడ్డ టాలీవుడ్ బాబులు

All heroes interested in remake movies

01:25 PM ON 9th January, 2016 By Mirchi Vilas

All heroes interested in remake movies

ఈ ఏడాది రీమేక్‌ సినిమాలు సందడి ఉధృతంగా ఉంది. మన కథానాయకులంతా రీమేక్‌ సినిమాలకే మక్కువ చూపుతున్నారు. ఈ ఏడాది దాదాపు చాలా  సినిమాలు రీమేక్‌ చిత్రాలుగా త్వరలో తెరకెక్కనున్నాయి. అగ్ర కథానాయకులే కాకుండా యువ హీరోలు కూడా ఆ బాటలోనే వెళుతున్నారు. మనముందుకు రానున్న రీమేక్‌ మూవీస్‌ ఏమిటో తెలుసుకుందాం.

1/9 Pages

1.చిరంజీవి (కత్తి)

తమిళంలో ఎ.ఆర్‌ మురుగుదాస్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'కత్తి'  రైతు సమస్యల నేపధ్యంలో విజయ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 2014లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్‌ రోల్‌ చేయగా హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తుంది. ఈ సంచలన విజయాన్ని సృష్టించిన చిత్రాన్ని మెగా స్టార్‌ 150వ చిత్రంగా చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇంకో విషయం ఏమిటంటే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు.

English summary

All heroes interested in remake movies