హీరోయిన్లతో గొడవలు లేవన్న అనుష్క

All Heroines Are Good Friends Says Anushka

09:41 AM ON 24th February, 2016 By Mirchi Vilas

All Heroines Are Good Friends Says Anushka

పోటీ అనేది సహజం ... ఇక అసూయ , ద్వేషం కూడా చాలామందికి వుండడం చూస్తూనే వుంటాం. అందునా హీరోయిన్ల మధ్య అయితే మరీను. ఒకప్పుడు హీరోయిన్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఒకే సినిమాలో నటించినా సరే... ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. అయితే ఇటీవల హీరోయిన్ల మధ్య స్నేహ సంబంధాలు బానే ఉంటున్నాయట. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ యుగళ గీతం వినిపిస్తోంది ఎవరైనా హీరోయిన్ ఓ మంచి పాత్ర చేస్తే అభినందించడం కూడా పెరిగింది. ఇందులో ముఖ్యంగా స్వీటీ బ్యూటీ అనుష్క అయితే మొదట్నుంచీ తోటి హీరోయిన్ లతో స్నేహంగా ఉంటూ , అందరినీ ఆకట్టుకుంటోంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ వరకు అందరూ అనుష్కతో బానే వుంటారు . ముఖ్యంగా సోనాక్షి సిన్హా మొదలు తమన్నా వరకు చాలామంది అనుష్కని బహిరంగంగా పొగిడినవాళ్లే. ప్రస్తుతం అనుష్క‘బాహుబలి- ది కన్‌క్లూజన్‌’లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఇక అందిరితో అంతలా స్నేహంగా వుంటారు కదా, మరి ఎవరి మీదనైనా ఈర్ష్య పుట్టింది లేదా? అని అనుష్కని టచ్ చేస్తే, ‘‘మేం స్నేహంగా ఉంటాం. అదే సమయంలో మా మధ్య పోటీ కూడా ఉంటుంది. అసలు పోటీ అనేది లేకుంటే ఏ వృత్తినీ ఆస్వాదించలేం. అందుకే మరింత మంచి పాత్రలు ఎంచుకోవాలి, వేరొకరి కంటే బాగా నటించాలనే తపన నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఒక మంచి అవకాశం అందినప్పుడు - ‘ఇలాంటి పాత్ర నాకు కాకుండా వేరొకరికి వెళ్లుంటే, నిజంగా వాళ్లని ద్వేషించేదాన్నేమో. వాళ్లపై నాకు అసూయ పుట్టేదేమో అనిపిస్తుంటుంది. కానీ అలాంటి పాత్రలు నాకు చాలాసార్లే లభించాయి. అందుకే వేరే వారిపై ద్వేషం ఇక ఎందుకు వుంటుంది. ఒకవేళ ద్వేషం , ఈర్ష్య వుంటే నామీదే వుంటాయి ’’ అంటూ ఈ అనుష్క వివరిస్తోంది.

English summary

Telugu Top heroine Anushka Says that the heroines in the industry were good friends.She says that they will never scold or comment on others films.Anushka Says that there will be a competition between them.Presently Anushka was acting in Bahubali 2.