అయుత చండీ యాగానికి ఏర్పాట్లు షురూ ...

All Set For Ayutha Chandi Yagam

01:47 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

All Set For Ayutha Chandi Yagam

తెలంగాణా సిఎమ్ కెసిఆర్ తలపెట్టిన అయుత చండీయాగానికి సర్వం సిద్ధం అయింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న భారీ ఏర్పాట్లు పూర్తికావడంతో ఇక యాగ నిర్వహణ పై దృష్టి కేంద్రీకరించారు. దీంతో మెదక్ జిల్లా ర్రవల్లిలో పండగ వాతావరణం మొదలైంది. ఎర్రవెల్లి గ్రామ శివారు నుంచి చండీయాగ శోభ స్పష్టంగా దర్శనమిస్తోంది. 23 నుంచి యాగం మొదలవున్నప్పటికీ, మంగళవారం గౌరీ హోమం నిర్వహించారు.

చండీయాగానికి సంబంధించి స్వాగత తోరణాలు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం నుంచి రహదారికి ఇరువైపులా మొక్కల ఏర్పాటు పలువురిని ఆకర్షిస్తోంది.

అయుత చండీ యాగానికి రాష్ట్రపతి మొదలుకుని పలువురు వి ఐ పిలను ఆహ్వానించారు. బుధవారం యాగం మొదలవుతున్న నేపధ్యంలో గవర్నర్ నరసింహం దంపతులు హాజవతారు. 27వ తేదీ లోగా వరుసగా పలువురు ప్రముఖులు రాబోతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ఎపి సిఎమ్ చంద్రబాబు , తమిళనాడు గవర్నర్ కె రోశయ్య , కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తదితరులు వస్తున్నారు.

ఇక యాగానికి సంబంధించి ప్రతిరోజూ 50 వేలమందికి ప్రసాదం , భోజనం అందించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు. క్యూ లైన్లను ఏర్పాటు చేయటంతో పాటు అన్నీ క్రమపద్ధతి లో సాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. యాగశాలకు వచ్చి, తిరిగి బయటకు వెళ్లే సమయంలో భోజనశాలకు చేరుకునే ఏర్పాటు చేసారు.

రుత్వికుల కోసం షెడ్లలో భారీ ఏర్పాట్లు చేయటంతో పాటు.. పచ్చని తివాచీలు పరిచారు. వారు ఉండేందుకు, అలాగే భోజనం చేసేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి అయుత చండీయాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

అయుత చండీ యాగానికి సంబంధించి సోమవారం ఉదయం గురు ప్రార్థన తో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గణపతికి.. హోమగుండాలకు.. గోవుకు పూజలు. ఫుణ్యాహవచనం.. దేవనాంది.. ఆంకురారోపణ.. పంచగ్రవ్య మేళనం.. ప్రాశనం.. మహాసంకల్పం.. సహస్రమోదక మహా గణపతి హోమం.. మహా మంగళహారతి నిర్వహించారు. సిఎమ్ కెసిఆర్ దాదాపు నాలుగు గంటలపాటు పూజలో కూర్చున్నారు. మంగళవారం కెసిఆర్ దంపతులు గౌరీ హోమం నిర్వహించారు.

ఎర్రవల్లిలోని గ్రామ దేవతలు గండి మైసమ్మ.. పోచమ్మ ఆలయాల్లో కేసీఆర్ దంపతులు పూజ చేసారు. చేశారు. అలాగే యాగం కోసం వందలాది మంది రుత్వికులకు ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. వీవీఐపీల కోసం తయారు చేసిన గదుల్ని చెక్ చేశారు. ఏర్పాట్లకు సంబంధించిన మొత్తం వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.

English summary

All ready for Ayutha Chandi Yagam which was going to be start tomorrow. This was conduating by telangana state cheif minister KCR.Kcr invited soo many VIP's to this event including Pranab mukherjee, Narendra modi, Chandrababu naidu etc