కుర్ర హీరోలు అందరికీ ఈమె కావాలట! అంతగా ఈమెలో ఏముంది?

All young heroes are asking Lavanya Tripathi as heroine

02:48 PM ON 9th August, 2016 By Mirchi Vilas

All young heroes are asking Lavanya Tripathi as heroine

ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైం వస్తుంది. ఇప్పుడు ఈ సొట్ట బుగ్గల భామకు ఛాన్స్ వచ్చింది. అందుకే టాలీవుడ్ లో జోరు మీదున్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి పేరు ముందు వినిపిస్తోంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన ఈ అందాల రాక్షసి చేసిన సినిమాలు తక్కువే అయినా, సక్సెస్ రేటు సూపర్ గా ఉండడంతో చాలామంది హీరోలకు లావణ్య మంచి ఆప్షన్ అయింది. టాలీవుడ్ లో కొందరు హీరోలు లావణ్యే కావాలని పట్టుపడుతున్నారట కూడా! ఆ జాబితాలో శర్వానంద్ వచ్చి చేరాడు. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న శర్వానంద్ తన కొత్త సినిమాలో లావణ్య కావాలని పట్టుపట్టాడట!

ఈ సినిమాలో అక్ష కూడా ఓ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా లావణ్యను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం! ఈ సినిమాకు చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ లావణ్య పేరుకే శర్వానంద్ ఓటు వేశాడట! లావణ్య డేట్లు కొద్దిగా ఇబ్బంది అయినా సర్దుకుపోవడానికి రెడీ అని చెప్పాడట! మొత్తానికి లావణ్యలో ఏముందో గానీ భలే ఛాన్స్ కొట్టేస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

English summary

All young heroes are asking Lavanya Tripathi as heroine