పాత కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తున్న 'అల్లరి'!

Allari Naresh acting in Siddu from Srikakulam fame direction

03:03 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Allari Naresh acting in Siddu from Srikakulam fame direction

రాజేంద్రప్రసాద్‌ తరువాత మళ్లీ అంతటి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకి నవ్వులు పువ్వులు పూయించాడు. అయితే చాలా కాలంగా నరేష్‌కి సరైన హిట్‌ తగలక సతమతమవుతున్న సమయంలో ఈ ఏడాది రిలీజైన 'జేమ్స్‌బాండ్‌' విజయంతో మళ్లీ మునుపటి ఉత్సాహాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుతో కలసి 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రంతో క్రిస్మస్‌కి మన ముందుకు వస్తున్నాడు. ఇది విడుదలవ్వక ముందే మరో కొత్త సినిమాని లైన్లో పెట్టేశాడు.

అల్లరి నరేష్‌ నటించిన 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్‌ తన కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిన్ననే మొదలైంది. గోపీ ఆర్ట్స్‌ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిల్‌ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

English summary

Allari Naresh acting in Siddu from Srikakulam fame direction. This movie shooting started on yesterday.