విజయ్‌మాల్యాను పట్టేసిన అల్లరి నరేష్

Allari Naresh Catches Vijay Mallya

03:20 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Allari Naresh Catches Vijay Mallya

హాస్య చిత్రాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ ఇప్పుడు ఓ సంచలన సృష్టించాడు. వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడి... దేశం విడిచి వెళ్లిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్‌ యజమాని, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. బ్రిటన్ లోని మారుమూల గ్రామంలో మాల్యా వున్నారని వార్తలొచ్చాయి. అయితే వ్యవహారంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడించింది.

సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులకు చిక్కకుండా తప్పించుకుని విదేశాల్లో ఉన్న విజయ్‌ మాల్యా అనూహ్యంగా సినీనటుడు అల్లరి నరేష్‌ కి దొరికేసారు. మాల్యాతో నరేష్ సెల్ఫీ తీసుకున్నాడు మాల్యాతో కలిసి దిగిన ఫొటోను శనివారం ఉదయం అల్లరి నరేష్‌ తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లో పోస్టు చేసాడు. ఇదేంటి మాల్యాతో అల్లరి నరేష్ అని అందరూ ఆశ్చర్యపో తున్నారు కదా. ఇంతకీ విషయం ఏమంటే, ఇటీవల మాల్యా విదేశాలకు వెళ్లే సమయంలో తనకు తారసపడ్డాడని, బ్యాంకులకు చిక్కని మాల్యా తనకు చిక్కడం ఆనందంగా ఉందని నరేశ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.. ఈ ఫొటో ఎప్పుడు దిగాదనేది ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ కుండా ట్విస్ట్ ఇచ్చాడు నరేష్. కాగా మాల్యా ఈనెల 2న విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు భావిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి వెండితెరపైనే కాకుండా రియల్‌గానూ నరేష్ ఇలా... వినోదాన్ని పంచుతూ. నవ్వులు పూయిస్తున్నాడు.

English summary

Telugu Comedy hero Allari Naresh catches Vijay Mallya.Allari Naresh posted a photo on his twitter and facebook by saying that that was the last selfie of Vijay Mallya when he was in India.Now this photo was going viral over social media.