బన్నిపై సెల్ఫీ రాజా సెటైర్... చెప్పను బ్రదర్

Allari Naresh Selfie Raja movie Trailer

11:20 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Allari Naresh Selfie Raja movie Trailer

ఈనెల 15వ తేదీన అల్లరి నరేష్ సెల్ఫీరాజా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ కు ముందు తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బ్రతికున్నవాళ్లతోనే కాదు, చనిపోయిన వాళ్లతో సైతం సెల్ఫీలు తీసుకుని అల్లరి నరేష్ తన మార్కు కామెడీని ఈ సినిమాలో చూపించాడు.

అయితే, ఈ ట్రైలర్ లో అందర్నీ ఆకర్షిస్తోన్న అంశం మాత్రం ట్రైలర్ చివర్లో ఉంది. పృద్ధ్వి 'చెప్పను బ్రదర్' అనే డైలాగ్ హైలెట్ అంటున్నారు ఆడియన్స్. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ మాట్లాడమని కోరిన సందర్భంలో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్న మాటే ఈ డైలాగ్ అని ఆడియన్స్ అంటున్నారు. మొత్తం మీద పేరడీ డైలాగులకు పెట్టింది పేరైన అల్లరి నరేష్ ఆసారి బన్నీ ని టార్గెట్ చేసాడు.

ఇది కూడా చూడండి: ఇండియాలో భయంకరమైన ప్రదేశాలు

ఇది కూడా చూడండి: అజిత్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు పవన్ దిమ్మతిరిగే ఆన్సర్!

ఇది కూడా చూడండి: కత్తిలాంటోడులో బర్నింగ్ స్టార్

English summary

Allari Naresh Selfie Raja movie Trailer.