మా ఆవిడ నేను నటించిన ఒక్క సినిమానే చూసింది..

Allari Naresh talking about her life partner

03:08 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Allari Naresh talking about her life partner

రాజేంద్రప్రసాద్‌ తరువాత మళ్లీ కామెడీ హీరోగా అంతపేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. అతి తక్కువ టైమ్‌లోనే 50కి పైగా సినిమాలు చేసిన ఏకైక హీరో నరేష్‌. నటనలో మంచి టైమింగ్‌ ఇస్తూ కామెడీ పండించడం నరేష్‌ స్టైల్‌. ఒకే సంవత్సరంలో వరుస పెట్టి 6, 7 సినిమాలు చేసిన ఘనత నరేష్‌ సొంతం. అయితే ఇటీవల ఒకే తరహా కధలు, పాత చింతకాయ పచ్చడి టైపులో కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్‌ కొట్టిస్తున్నాడు. ఈ రొటీన్‌ చిత్రాలని ప్రేక్షకులు ప్రోత్సహించడంలేదు. కారణం ఏదైనా ఇటువంటి పొరపాటులు చెయ్యకుండా మళ్లీ కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాని నరేష్‌ అంటున్నాడు.

నరేష్‌ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి తెలిసిందే. చెన్నైకి చెందిన విరూపను వివాహమాడాడు. అయితే నరేష్‌ తన దాంపత్య జీవితం గురించి విశ్లేషిస్తూ, ఇప్పటి వరకు నా భార్య నేను నటించిన జేమ్స్‌బాండ్‌ చిత్రం ఒక్కటే చూసింది. అది కూడా మా పెళ్ళయ్యాకనే తను ఆ చిత్రం చూసిందని తన లైఫ్‌పార్టనర్‌ గురించి చెప్పుకొచ్చాడు.

English summary

Allari Naresh talking about her life partner that she saw only one movie that i was acted in Jamesbond.