ఉదయకిరణ్ చనిపోకముందు అల్లరి నరేష్ కి చెప్పిన సీక్రెట్!

Allari Naresh talks about Uday Kiran

01:23 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Allari Naresh talks about Uday Kiran

బాగా కష్టపడి యంగ్ ఏజ్ లోనే కెరీర్ లో టాప్ పొజీషన్ కి వచ్చిన హీరోలలో నెంబర్ వన్ హీరో ఉదయ్ కిరణ్. అప్పుడే ఉదయ్ చనిపోయి మూడేళ్ళు అవుతుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే అంటూ వరసపెట్టి హిట్లు కొట్టి, ఆ తర్వాత తన కెరియర్ లో వచ్చిన అనూహ్య పరిణామాలతో అతని కెరియర్ చాలా దెబ్బతింది. అయితే చనిపోవడానికి కొన్నిరోజులముందు ఉదయ్ చాలా బాధ పడ్డాడని అల్లరి నరేష్ ఈ మధ్య ఒక్క ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయం తన జీవితంలో ఎక్కువ బాధించిన విషయాలలో ఒకటిగా చెప్పారు నరేష్. చనిపోక ముందు ఉదయకిరణ్ ఒక రోజు నన్ను కలిశాడు. ఎందుకో అతని ముఖంలో దిగులు, బాధ కనిపించాయి.

ఎందుకు అలా ఉన్నావ్? అని అడిగా ఏమీలేదు నరేష్, పొద్దున్నే ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఒక యువహీరో కథల్ని సరిగా ఎంచుకోవట్లేదని రాసుంది అన్నాడు. అయితే నీ గురించి కాదు కదా అంటే చివరిలో ఈ యువ హీరో జాగ్రత్త పడకపోతే ఉదయకిరణ్ గతే పడుతుంది అని నన్ను ఉదాహరణగా చూపడం బాధిస్తోంది అన్నాడు. అని చెప్పారు. అది విన్నాక నేను కూడా చాలా బాధపడ్డాను. ఒక నటుడికి అవకాశాలు వచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తేసిన వీళ్లే.. కిందపడినప్పుడు ఎంత చిన్నచూపు చూస్తారో ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను అన్నారు.

English summary

Allari Naresh talks about Uday Kiran