శిరీష్ కు అల్లు అరవింద్ లవ్లీ గిఫ్ట్

Allu Aravind gave a gift to Allu Sirish

12:50 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Allu Aravind gave a gift to Allu Sirish

పుత్రోత్సాహం వస్తే ఏదైనా చేస్తారు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ తన రెండో కుమారుడు అల్లు శిరీష్ కు ఖరీదైన బహుమతి ఇచ్చారు. శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశాడు. 'లవ్లీ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడ్. ఆడీ క్యూ7, అన్నీ సమయాల్లో నాకు ఇష్టమైన కారు' అని శిరీష్ ట్వీట్ చేశారు. దీంతోపాటు తన తండ్రి కారు కీస్ ఇస్తుండగా అన్నయ్య అల్లు అర్జున్ తో పాటు కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం ఇటీవల విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.

English summary

Allu Aravind gave a gift to Allu Sirish