ఇక నాకు ఇష్టమైన హీరో ఆయన కాదు: బన్నీ

Allu Arjun about his favorite hero

04:41 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Allu Arjun about his favorite hero

ఈ మధ్య అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అంటూ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకని పైన టైటిల్ చూసి పవన్ అంటే ఇక నుండి అల్లు అర్జున్ కి ఇష్టం లేదని అన్నాడనుకోకండి. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. దాదాపు 2 దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్న షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ గురించే ఈ చర్చంతా. వీరి ముగ్గురి మధ్య ఎంతో కాలంగా పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో షారుక్ ఖాన్ ఆధిపత్యం చెలాయించేవాడు... ఆ తరవాత షారుక్ సినిమాలు కొన్ని ఫ్లాప్ కావడంతో... ఆమీర్ ఖాన్ ఊపందుకున్నాడు.

కాకపోతే ఆమీర్ ఒక్కో సినిమా విడుదల చేసే సమయంలో... సల్మాన్ రెండు సినిమాలు విడుదల చేసేస్తున్నాడు. ఇంకేముంది.. షారుక్, ఆమీర్ లను వెనక్కి నెట్టి... కండల వీరుడు సల్మాన్ ఇప్పుడు బాలీవుడ్ ను ఏలుతున్నాడు. మొన్నీ మధ్య అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై స్పందించాడు. బన్నీ మాట్లాడుతూ... ఒకప్పుడు షారుక్ నా అభిమాన నటుడు... ఆయన సినిమాలు తెగ చూసేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో సల్మాన్ అయిపోయాడు. ఈ మధ్య ఆయన సినిమాలు వరుసగా చూస్తున్నాను. అవి బాగా ఆకట్టుకుంటున్నాయి... అని అన్నాడు. అలాగే తమిళం లో విజయ్ అంటే ఇష్టం అని చెప్పాడు.

అతని సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని.. తనకు బాగా నచ్చుతుందని చెప్పాడు. ఏది ఏమైనా... బాలీవుడ్, కోలీవుడ్ గురించి క్లారిటీ ఇచ్చిన బన్నీ.. టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరోల విషయంలో కూడా తన రుచిని మార్చుకుని ఉంటాడని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇంతక ముందు ఇద్దరు ఉండేవారు. మరి ఇప్పుడెంత మంది ఉన్నారో? మొత్తానికి బన్నీ హాట్ టాపిక్ అయ్యాడు.

English summary

Allu Arjun about his favorite hero