విలన్ పాత్రలో బన్నీ

Allu arjun acts as Villain role for his next film

11:50 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

Allu arjun acts as Villain role for his next film

ఇది ఊహించలేక పోవచ్చు కానీ అల్లు అర్జున్ దీనికి రెడీ అవుతున్నట్టు తెల్సింది. తొలి సినిమా ‘గంగోత్రి’ నుండి మొన్నటి ‘సరైనోడు’ వరకూ తనను తాను మార్చకుంటూ నటుడిగా బన్నీ తన స్థానాన్ని మరింత పటిష్ట పరచుకుంటూ వస్తున్నాడు. నటనకు మార్కులు పడడానికి వీలుగా, పాత్ర నచ్చితే ‘హీరో’ అనే కోణం నుంచి మరో కోణంలో పయనించడానికి కూడా సై అనడానికి సిద్ధంగా ఉన్నాడట. సోలో హీరోగా చేసిన సినిమాలతో సమానంగా గుర్తింపు తెచ్చిన ‘కేబుల్ రాజు’, ‘గోన గన్నారెడ్డి’ పాత్రలు ఆ కోవలోకే వస్తాయి. అంతేకాదు, ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టేందుకు ఈ అల్లువారి పిల్లగాడు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ‘సరైనోడు’గా తెరమీదికొచ్చిన బన్నీ తన తర్వాతి సినిమాకోసం తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయి కలిపిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ హీరోగా నే కాక విలన్ అవతారం కూడా ఎత్తబోతున్నాడట. పైగా బన్నీ ద్విపాత్రాభినయం చేస్తోన్న తొలి సినిమా ఇదే అవుతుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో తమిళంలో తన మార్కెట్ పెంచుకోడానికే బన్నీ ‘సరైనోడు’ సినిమా నిండా ‘సాంబారు’ వాసనతో నింపేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బన్నీ విలన్గా నటిస్తున్నాడంటే సినిమాపై అంచనాలు రెట్టంపవడం కాదు, అసలు ఈ పాత్రతో ఎలా మెప్పిస్తాడో నని అభిమానులు కూడా ఆతృత పెరిగిపోవడం కూడా ఖాయం. చూద్దాం ఎలా రాణిస్తాడో.

ఇది కూడా చూడండి:అప్పుడే పుట్టిన బిడ్డను బొమ్మలా తిప్పేశాడు

ఇది కూడా చూడండి:'బ్రహ్మోత్సవం' నష్టం పూడ్చేసారు..

ఇది కూడా చూడండి:చెన్నైలో 'జనతా గ్యారేజ్' ఫుల్

English summary

Allu arjun acts as Villain role for his next film.