బన్నీ మరోసారి తండ్రయ్యాడు..!

Allu Arjun blessed with a baby girl

11:55 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Allu Arjun blessed with a baby girl

అల్లు వారింట సందడి నెలకొంది. లక్ష్మీదేవి వచ్చింది. అదే చిన్న పాపాయి అడుగు పెట్టింది. అవునండీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు సోమవారం రాత్రి పాప పుట్టింది. బన్నీ ఈ విషయాన్ని తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ కపుల్ కి తొలి సంతానంగా అబ్బాయి అయాన్ పుట్టిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో సంతోషంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ పేర్కొన్నాడు. తమకు కంగ్రాట్స్ చెప్పినవారికందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక మా ఇంట లక్ష్మీదేవి వచ్చిందని పాప పుట్టడంపై ఇంట్లో వాళ్ళు సంబరపడుతున్నారు.

English summary

Allu Arjun blessed with a baby girl