చెర్రీకి సవాల్ విసురుతున్న బన్నీ

Allu Arjun Challenges Ramcharan

03:47 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Allu Arjun Challenges Ramcharan

నందమూరి నట వారసుల నడుమే కాదు మెగా ఫ్యామిలీలో కూడా స్టార్ వార్ తారాస్థాయికి చేరిందా? ప్రస్తుతం సోషల్ సైట్లలోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ఈ టాక్ బలంగా నడుస్తోంది. వాస్తవానికి ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తున్నా గుంభనంగా వుండేది. పైగా 'అందరి ఇళ్ళల్లో ఇలాంటి గొడవలు సహజమేగా, దీనికి పెద్దగా ప్రాధాన్యత అక్కర్లేదు' అనే పరిస్థితి వుండేది. కానీ ఇటీవల ఆ ఫ్యామిలీలో కోల్డ్ వార్ కాస్తా వార్ నడిచే స్థాయికి చేరిందని అంటున్నారు.

ఒకసారి పరిస్థితిని పరిశీలిస్తే, స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో, ఆ ఫామిలీలో చిరు త‌ర్వాత ప‌వ‌న్ నిలుస్తాడని ఊహించినట్టు గానే జరిగింది. హిట్ మీద హిట్ కొడుతూ , మరోపక్క రాజకీయ ప్రచారంలో కూడా దూసుకుపోయాడు. అక్కడ వరకూ బానే వుంది. అయితే పవర్ స్టార్ త‌ర్వాత స్థానం కోసం ఇప్పుడు వార్ నేలకొందట. ఇన్నాళ్లూ రామ్ చ‌ర‌ణ్ ఆ ప్లేస్ లో ఉండేవాడు. చిరంజీవి కొడుకు కావడం వలన చ‌ర‌ణ్ ను మెగా ఫ్యామిలీ లో ప‌వ‌న్ త‌ర్వాతి స్థానంలో నిల‌బెట్టింది. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితులు తారుమారయ్యాయని అంటున్నారు. ప‌వ‌న్ త‌ర్వాత మెగా లెగ‌సీని ఆ స్థాయిలో బన్నీ కొనసాగిస్తున్నట్టు అందరూ అంటున్నారు.

వాస్తవానికి రామ్ చ‌ర‌ణ్ కన్నా అల్లు అర్జున్ సినీ ఆరంగేట్రం ముందే చేసేసి, బన్నీ అంటే ఏమిటో తన ప్రతిభతో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత చెర్రీ రంగ ప్రవేశం చేసి, కొంత మేరకు దూకుడు సాగించినా, ఇటీవల కెరీర్ స‌రైన స్పీడ్ లో లేదు. ఎందుకంటే, గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్ లీ వంటి చిత్రాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చెర్రీ ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక ఇదే సమయంలో బ‌న్నీ కెరీర్ టాప్ గేర్ లో సాగిపోతోంది. రేసుగుర్రంతో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్న బ‌న్నీ, అదే క‌న్సిస్టెన్సీ మెయింటేన్ చేస్తున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి సినిమాలు కూడా 50 కోట్ల‌కు పైగా వ‌సూలు చే సేసాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌ర‌స‌గా మూడు 50 కోట్ల సినిమాలున్న ఏకైక హీరో గా బ‌న్నీ
రికార్డు కొట్టేసాడు.

బన్నీ ఈ విధంగా దూసుకుపోతుంటే, వరుసగా మూస క‌థ‌ల‌తో ప్రేక్షకులను , ముఖ్యంగా అభిమానులను అలరించడంలో చ‌ర‌ణ్ వెనుకబడ్డాడు. ఇక ఓవ‌ర్సీస్ లో బ‌న్నీ సూప‌ర్ స్టార్. అక్క‌డ రెండు మిలియ‌న్ డాల‌ర్ సినిమాలున్నాయి. మ‌ళ‌యాలంలోనూ బ‌న్నీ స్టార్ గా వున్నాడు. కానీ చ‌ర‌ణ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. చేరరే కి ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 4 కోట్లు వ‌సూలు చేసిన సినిమాలే లేకపోవడం ఓ కారణమైతే, ఇక తెలుగులో త‌ప్ప మ‌రెక్క‌డా మార్కెట్ లేకుండా పోయింది. ఇంకేముంది ఎంత మెగా కొడుకైనా చెర్రీ కి పరిస్థితులు కల్సి రావడంలేదు. దీంతో మెగా ఫ్యామిలీలో చ‌ర‌ణ్ కంటే బ‌న్నీని ముందు వరుసలో చేర్చేస్తోంది. మరి బావా బామర్డుల మధ్య నడుస్తున్న ఈ వేరియేషన్ లో ఒకప్పుడు మెగా పవర్ తో నిలదొక్కుకున్న బన్నీ, ఇప్పుడు సొంత ఇమేజ్ తో దూసుకుపోతూ, మెగా వారసుడిని మించి పోయాడు. దీనికి అడ్డుకట్ట పడాలంటే, చెర్రీ బ్లాక్ బస్టర్ కొట్టే మూవీ చేయాల్సిందే. లేకుంటే బన్నీ ముందు నిలవడం కష్టమే నని సినీ విశ్లేషకుల అంచనా. మొత్తానికి స్టార్ వార్ పెద్ద స్టార్స్ కుటుంబాల్లో సాదారణం అయిపొయింది.

English summary

Tollywood Stylish Star Allu Arjun was giving huge competetion to Mega Power Star Ram Charan.Allu Arjun movies has good market in tollywood and as well as in Malayalam.But Ram Charan Has market only in Andhra Pradesh.Allu Arjun also has good market in Overseas as well. Over all Allu Arjun was become huge competitor to Ram Charan.