భార్యతో కలిసి చిందేసిన 'సరైనోడు'

Allu Arjun dance with his wife

10:26 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Allu Arjun dance with his wife

ఈ మధ్యకాలంలో వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి వచ్చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ టూర్‌కి వెళ్లాడు. అయితే బన్నీ డ్యాన్స్ ఇరగదీస్తాడని, ఈ విషయంలో అతనికి తిరుగులేదని అంటారు కదా. మరి కాశ్మీర్ టూర్ లో బన్నీ వేసిన స్టెప్పులకు అతడి వైఫ్ స్నేహా‌రెడ్డి జత కలిసింది. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో బన్నీ- స్నేహాలు కలిసి సల్మాన్ మూవీ ‘కిక్‌’ లోని ఓ పాటకు చిందేసారు. ఈ డ్యాన్స్ చాలా ప్రొఫెషనల్‌గా ఉందని కొందరిమాట. చాలా మంది ఇది శ్రీజ సంగీత్ ఫంక్షన్‌లోదని అంటుండగా, మరికొందరు అదేంకాదని, బన్నీకి సంబంధించి ప్రైవేట్ ఈవెంట్ అని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అభిమానులు మాత్రం తెగ సంబర పడిపోతున్నారట.

English summary

Allu Arjun dance with his wife