బన్నీ మళ్ళీ ఫైర్ అయ్యాడు

Allu Arjun Fires On Movie reviews

10:15 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Allu Arjun Fires On Movie reviews

ఈ మధ్య బన్నీకి వరుసగా కోపం చిర్రెత్తుకోస్తోంది.‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్‌తో పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా సెటైర్లు వేసి పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తించిన బన్నీ.. తాజాగా రివ్యూల మీద ఎగిరి గంతేశాడు.' సినిమా సమీక్షలు రాసేవాళ్ళకు అసలు సినిమా అంటే ఏమిటో తెలియదేమో' అంటూ మండిపడ్డాడు. రివ్యూలు రాసేవాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే కావచ్చు.. కానీ వాళ్ళ స్థాయిలోనే ఆలోచిస్తున్నారని, అయితే ప్రస్తుతం సమీక్షలు రాసేవారి దగ్గర్నుంచీ సినిమా టెక్నీషియన్ల వరకూ అర్బన్ ఆడియెన్స్ గురించే ఆలోచిస్తున్నారని, సి-క్లాస్ ఆడియెన్స్ గురించి పెద్దగా తెలియదని అల్లు అర్జున్ తేల్చేసాడు. "4జీ, వాట్సప్ అంటూ ఎక్కడో ఉండిపోయారు..అంతా చదువుకున్న వాళ్ళే.. ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళే.. కానీ సి-సెంటర్ల గురించి ఏం తెలుసు..అయినా జెన్యూన్‌గా రివ్యూలు ఎవరు రాస్తున్నారు చెప్పండి...అలా రాసేవాళ్ళుంటే వారిని గౌరవిస్తా.. అందుకే నేను రివ్యూలు చదవను' అంటూ వీర లెవెల్లో క్లాస్ పీకాడు.

ఇవి కూడా చదవండి:ఆ ప్రశ్నతో సమంతకు దిమ్మ తిరిగింది

అయితే జెన్యూన్ రివ్యూలంటే ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తన సరైనోడు మూవీ మొదట్లో ఏవరేజ్‌గా ఆడినప్పుడు ఆ సంగతిని, ఆ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా సమీక్షకులు రాసిన విషయాన్ని సరైనోడు మరచిపోయినట్టున్నాడనే కామెంట్లు వస్తున్నాయి. అలాగే ఈ మూవీ కలెక్షన్లు దూసుకుపోతున్న వైనాన్ని కూడా రివ్యూలు వరసబెట్టి లెక్కలిచ్చాయి. ఏది ఏమైనా బన్నీ కి ఈ మధ్య ప్రెస్ స్టేషన్ పెరిగిందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:కొడుకుతో రమ్యకృష్ణ ర్యాంప్ వాక్

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

English summary

Tollywood Stylish Star Allu Arjun was recently made some comments on Pawan Kalyan and now Allu Arjun fired on Reviewers . He said that he will appreciate who write genuine reviews .