పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

Allu Arjun fires on Pawan Kalyan fans

10:02 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Allu Arjun fires on Pawan Kalyan fans

మొన్న విజయవాడలో జరిగిన 'సరైనోడు' సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అనే మాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై బన్నీ పై పవన్ ఫాన్స్ విరుచుకుపడ్డారు. అయితే నిన్న జరిగిన ఒక మనసు ఆడియో వేడుకకి బన్నీ ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే మొన్న పవన్ గురించి చెప్పను బ్రదర్ అని ఎందుకన్నాడో బన్నీ క్లారిటీ ఇచ్చేసాడు.. ఏమన్నాడో బన్నీ మాటల్లోనే.. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'మీరు ప్రతీసారి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిసినప్పుడు.. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు అస్సలు కారణం కాదు. నేను మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు మీరే.

మీరంటే అందరూ కాదు.. ప్రత్యేకంగా పవర్ స్టార్ గారి కొందరు అభిమానులు మాత్రమే. అసలు మేము పబ్లిక్ ఫంక్షన్స్ పెట్టేదే మీరందరూ ఆనందంతో కేకలు వేసి ఎంజాయ్ చేస్తారని. కానీ మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిసి కొన్ని ఫంక్షన్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్ వల్లే ఆయన గురించి టాపిక్ అవైడ్ చేసాను. మీతో కొంచెం సేపు మాట్లాడాలని నాకు ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులకి వారి ఫంక్షన్స్ లో కాస్త మాట్లాడాలని ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడో కాని రావు. అలా ఆర్టిస్టులు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు. ఆ సందర్భంలో వాళ్ళ మాటల మధ్యలో మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిస్తే.. అంత పెద్ద హీరో గురించి ఏదో మా మాటలు ఆపేసి మెకానికల్ గా మాట్లాడాల్సి వస్తుంది.

మీరు అలా అరవకుండా సరదాగా వారి మాటలు వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకుని ఆ తరువాత పవర్ స్టార్ గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి అరవండి కానీ దానికి కొంచెం లిమిట్ ఉంటుంది. అంతే గాని ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు మధ్య లో అలా అరిస్తే బాగోదు కదా. ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద సినిమా తీసి ఆ సినిమా గురించి మాట్లాడాలని ఒక ఫంక్షన్ పెడితే ఆ ఫంక్షన్ లో ఆయన ఫీలింగ్స్ చెప్పుకోనివ్వకుండా మధ్యలో పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే తప్పు బ్రదర్" అంటూ పవన్ ఫాన్స్ పై ఫైర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇదండీ పవన్ గురించి చెప్పను బ్రదర్ అని అనడానికి కారణం.. ఈ కింద వీడియోలో బన్నీ చెప్పిన మాటలు మీరు కూడా వినండి.

English summary

Allu Arjun fires on Pawan Kalyan fans. Allu Arjun gave clarity for avoiding Pawan Kalyan on stage.