ఆమె చివరి కోరిక తీర్చిన అల్లు అర్జున్..

Allu Arjun fulfils her last desire

03:35 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Allu Arjun fulfils her last desire

విజయవాడ శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల మస్తాన్బి మూత్రనాల క్యాన్సర్‌ రోగంతో భాదపడుతోంది. ఆమె మరో 6 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకదు. కానీ ఈమె చనిపోతున్నాను అనే బాధ కంటే తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ ని చూడకుండా చనిపోతున్నాననే బాధ ఆమెను ఎక్కువ గా బాధిస్తుంది. మస్తాన్బి మాట్లాడుతూ నేను చిన్నతనం నుండి అల్లు రామలింగయ్యకి పెద్ద అభిమానిని తరువాత ఆయన నట వారసుడు అల్లు అర్జున్‌కి వీరాభిమానిని. నేను చనిపోయేలోపు అల్లుఅర్జున్‌ని ఒక్కసారైనా చూడాలని కోరిక.

అతన్ని చూడకుండా చనిపోతానని భయంగా ఉందంటూ తన మనసులో బాధని పంచుకుంది. తన బాధని అర్ధం చేసుకున్న మస్తాన్బి కుంటుంబ సభ్యులు టీవీ 9 ద్వారా అల్లు అర్జున్‌కి తెలిసేలా చేశారు. ఆ విషయం తెలుసుకున్న అల్లుఅర్జున్‌ వెంటనే ఈ రోజు ఉదయం బయల్దేరి విజయవాడ చేరుకున్నాడు. మస్తాన్బి ని కలిసి, ఆమెతో కాసేపు మాట్లాడి ఆమె చివరి కోరిక తీర్చి ఆమె గుండెల్లో నిజమైన ఆనందాన్ని నింపాడు.

English summary

Allu Arjun fulfils her last desire. She is suffering from cancer and her last desire is to meet his favorite hero Allu Arjun.