హరీష్ శంకర్ సినిమాలో బన్నీ 8 ప్యాక్? ప్రూఫ్ ఇదిగో!

Allu Arjun getting 8 pack for Harish Shankar movie

01:11 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Allu Arjun getting 8 pack for Harish Shankar movie

సినిమాసినిమాకి తన బాడీ లాంగ్వేజ్ లో, డ్రెస్సింగ్ స్టైల్ లో, హెయిర్ స్టైల్ లో వేరియేషన్ చూపిస్తాడు అల్లు అర్జున్. అందుకు బన్నీ స్టైలిష్ స్టార్ అయ్యాడు. వీటితో పాటు కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. బన్నీ స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అనౌన్స్ చేసాడు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా.. దానికి తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. దేశముదురు టైమ్ లోనే అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు.

అంతే కాదు టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ మొదట పరిచయం చేసింది కూడా బన్నీనే. అందుకే ఈసారి 8 ప్యాక్ ను తెరపై చూపించనున్నాడట. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యకపోయినా.. ఫ్రెండ్ షిప్ డే రోజున క్రిష్ పెళ్లితోపాటు అంతకు మందురు రోజు జరిగిన ఈవెంట్స్ లో బన్నీ గెటప్ చూస్తే ఇదే అనిపించక మానదు. ఫిట్నెస్ లు చేసి చేసీ అల్లు అర్జున్ బాడీని, బాడీ లాంగ్వేజ్ ని కంట్రల్ చేసిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. అయినా.. స్టైలిష్ స్టార్ సినిమాకో లుక్కు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు మాట.

English summary

Allu Arjun getting 8 pack for Harish Shankar movie