ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన బన్నీ

Allu Arjun Impressed With Janata Garage First Look

05:43 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Allu Arjun Impressed With Janata Garage First Look

నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మిర్చి ఫేం డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వంలో "జనత గ్యారేజ్" చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జనత గ్యారేజ్ ఫస్ట్ లుక్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది .విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది .

ఇవి కూడా చదవండి:బన్నీ మాటలకు ఫ్యాన్స్ డిష్యుం డిష్యుం

ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు .అంతేకాక జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు . ఈ ట్వీట్ తో తాము అందరం ఒకటేనని స్టైలిష్ స్టార్ చెప్పకనే చెప్పాడు.

టెంపర్ , నాన్నకు ప్రేమతో వంటి వరుస విజయాల తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . జనత గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ చాలా రఫ్ గా మాస్ హీరోగా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ని చూస్తే అర్ధం అవుతుంది . ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:అల్లు అర్జున్‌ ని పవన్‌ గురించి నిలదీసిన మెగాస్టార్‌

English summary

Young Tiger NTR recent film Janata garage movie first look was released by the movie unit because on NTR's Birthday . Stylish Star Allu Arjun Wished NTR and said that he was impressed with the first look of Janata Garage.