మనం డైరెక్టటర్‌తో బన్నీ..

Allu Arjun in Vikram.K.Kumar direction

03:23 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Allu Arjun in Vikram.K.Kumar direction

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవల తను చేసిన సినిమాలన్నీ సైలెంట్ హిట్‌ సాధిస్తున్నాయి. తాజాగా రుద్రమదేవిలో తను చేసిన గోనగన్నారెడ్డి క్యారెక్టర్‌ తన కెరీర్‌కే ఎంతో ప్లస్ అయింది. బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం 'సరైనోడు', బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన తొలిసారి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది, మరో కధానాయికగా కేధరిన్‌ నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం బన్నీ ఒకే చేసిన తరువాత చిత్రం విక్రమ్‌.కె.కుమార్‌ తో ఉండబోతుంది. ముందు విక్రమ్‌ కుమార్‌ ఈ కధని మహేష్‌బాబుకి వినిపించారు.

మహేష్ నుండి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో ఈ కధని బన్నీకి వినిపించారు, కధ బన్నీకి మంచి యాప్ట్‌ అవ్వడంతో వెంటనే ఓకే చేశాడని సమాచారం. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ సూర్యతో 24 చేస్తున్నాడు, దాని ఘాటింగ్‌ పూర్తయిపోయింది కానీ నిర్మాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బన్నీకూడా సరైనోడు ఘాటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక వీళ్లదిరి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary

Allu Arjun in Vikram.K.Kumar direction after completion of allu arjun and Boyapati sreenu movie shooting.