అల్లు అర్జున్ షూటింగ్ లో గాయపడ్డాడా..?

Allu Arjun injury in small accident

02:49 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Allu Arjun injury in small accident

రంగారెడ్డి జిల్లా నర్సింగ్‌ లోని ఒక స్థలం విషయంలో హిమాయత్‌ నగర్‌ కు చెందిన కుటుంబానికి, అల్లు అర్జున్‌ కుటుంబానికి వివాదం నడుస్తుంది. 2008 నుండి 20 ఎకరాల స్థలం విషయంలో జరుగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని అల్లు అర్జున్‌, శిరీష్‌, తల్లి నిర్మల వీరితోపాటు స్థలం యజమానులుగా చెప్పబడుతున్న ఆదిర్ష్‌ దేవ్‌, రాహుల్‌ దేవ్‌ లు సోమవారం రంగారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఇరువర్గాల వారు చివరికి ఈ స్థలం విషయంలో రాజీకి వచ్చారట. రాజీకి సంబంధించిన పనులను పూర్తి చేసుకోవడానికి కోర్టుకి హాజరయ్యారు.అయితే అక్కడికి విచ్చేసిన అభిమానులు అల్లు అర్జున్‌ చేతికి బ్యాండేజ్‌ ఉండడంతో కంగారు పడిపోయారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' సినిమా చేస్తున్నారు. అందులో యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు చిన్న యాక్సిడెంట్‌ జరిగి బన్ని చేతికి దెబ్బలు తగిలాయని సమాచారం. బోయపాటి సినిమా అంటేనే ఒక రేంజ్‌లో ఊహించుకోవచ్చు. ఇక బన్ని చేతులు విరిగాయి అంటే ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి.

English summary

Allu Arjun injury in small accident