'హాట్ స్టార్' కు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ

Allu Arjun is the brand ambassador for Hotstar

01:15 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Allu Arjun is the brand ambassador for Hotstar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లుతో దూసుకుపోతున్నాడు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస హిట్లుతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకునేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే బన్నీ చేతిలో కొన్ని బ్రాండ్స్ ఉండగా.. ఇప్పుడు 'హాట్ స్టార్' కూడా వచ్చి చేరింది. తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలకు సంబంధించి హాట్ స్టార్ కి ప్రమోటింగ్ ఐకాన్ గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బన్నీ పై తీసిన యాడ్ కూడా టీవీల్లో టెలికాస్ట్ అవుతోంది. హాయ్ స్టైలిష్ స్టార్ అంటే.. 'కాదు.. హాట్ స్టార్' అంటూ అల్లు అర్జున్ పలికిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

దేశంలో అతి పెద్ద డిజిటల్ కంటెంట్ ప్లాట్ ఫామ్ అయిన తమ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను తీసుకున్నట్లు హాట్ స్టార్ ప్రకటించింది. 'నాకు క్రికెట్ తో పాటు ఇతర స్పోర్ట్స్ లో అప్ డేటెడ్ గా ఉండడం ఇష్టం. ఇప్పుడు స్కోర్ చూసేందుకు నా వ్యాన్ లో పెద్ద టీవీ అక్కర్లేదు. జేబులో హాట్ స్టార్ యాప్ ఉన్న ఫోన్ ఉంటే చాలు' అంటున్నాడు బన్నీ.


English summary

Allu Arjun is the brand ambassador for Hotstar