లిఫ్ట్ లో ఇరుక్కున్న బన్నీ.. తప్పిన ప్రమాదం!

Allu Arjun just missed from the accident

11:34 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Allu Arjun just missed from the accident

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే నటించిన తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మాంచి ఊపులో ఉన్నాడు బన్నీ. సక్సెస్ మీట్లు, సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతూ.. ఎప్పుడూ లేనంత బిజీగా బన్నీ ఉన్నాడు.. అయితే ఈ బిజీలో ఉండగానే బన్నీకి చిన్న ప్రమాదం తప్పింది... ఈ రోజు ఉదయమే బోయపాటి శ్రీనుతో కలిసి సింహాచలం అప్పన్నని దర్శించుకున్నాడు బన్నీ.. ఆ తర్వాత దేవస్థానం కేటాయించిన గదిలో నుంచి కిందకి రావడానికి లిఫ్ట్ ఎక్కగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కంగారు పడ్డ అధికారులు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు లిఫ్ట్ తలుపులు పగలగొట్టి మరీ బన్నీని, బోయపాటిని బయటకి లాగారు.

లిఫ్ట్ లో జరిగిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలియజేసారు. మొత్తానికి బన్నీ మాత్రం ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగా బయట పడ్డాడు.. దీంతో దర్శకుడు బోయపాటి మరోసారి దేవుడికి దణ్ణం పెట్టుకుని కృతఘ్నతలు తెలిపారట...

English summary

Allu Arjun just missed from the accident