'దువ్వాడ జగన్నాధమ్' గా సరైనోడు

Allu Arjun Next Movie Titled As Duvvada Jagannadham

10:26 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Allu Arjun Next Movie Titled As Duvvada Jagannadham

గంగోత్రి నుంచి వరుస ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించిన బన్నీ ఇప్పుడు మరో చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఈమధ్య సరైనోడు గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ (డీజే)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర లోగోను చిత్ర బృందం ఆదివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

టైటిట్ అదిరింది.. డీజే రాకింగ్ .. అంటూ దేవీశ్రీ ప్రసాద్ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రేపటినుంచి ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ 'దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బన్నీతో చిత్రం చేయబోతున్నా. దర్శకుడు హరీశ్ అర్జున్ ఇమేజ్ తగిన స్క్రిప్టును సిద్ధం చేసాడు' అని చెప్పాడు. దిల్ రాజు, బన్నీ కాంబినేషనల్ లో వచ్చిన ఆర్య , పరుగు చిత్రాలు మంచి హిట్ కొట్టాయి.

ఇవి కూడా చదవండి:హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇవి కూడా చదవండి:ఐదు నిమిషాల యాడ్ కోసం 75 కోట్లు! ఇంతకీ ఆ యాడ్ లో ఏముందో మీరు ఓ లుక్కేయండి

English summary

Tollywood Stylish Star Allu Arjun's next movie was titled as "Duvvada Jagannadham(DJ)" and this movie was going to be direct by Harish Shankar and Dil Raju was the producer of this movie. This movie first look was revealed by Director Harish Shankar through his Twitter Account.